Andhra Pradesh Flood Relief Funds Release: ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు పరిహారం అందించింది. వరదల్లో నష్టపోయిన 4లక్షల మంది బాధితులకు బుధవారం రూ.602 కోట్ల పరిహారాన్ని విడుదల చేశారు. అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామన్నారు చంద్రబాబు. ఇంకా కొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. అలాగని వరద సాయం విషయంలో అవినీతి, అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆందోళనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.