AP Govt Approves APSRTC Compassionate Jobs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో మరోసారి కారుణ్య నియామకాలకు అనుమతించింది. రాష్ట్రవ్యాప్తంగా 76 మంది ఆర్టీసీ సిబ్బందికి సంబంధించి కుటుంబంలోవారికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ జిల్లాస్థాయి కారుణ్య నియామకాల కమిటీ చేపట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.