Andhra Pradesh Panchayati Raj Department Compassionate Appointments: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కీలకమైన ఫైల్ ముందుకు కదిలింది. పంచాయరాజ్‌శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించి ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది. గతంలో కారుణ్య నియామకాల అంశాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.. వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించి ఫైల్ సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పుడు ఆ ఫైల్ సీఎం దగ్గరకు వెళ్లింది.. అక్కడ గ్రీన్ సిగ్నల్ రాగానే లైన్ క్లియర్ అవుతుంది.