ఏపీలో వారందరికి పండగే.. ఇకపై స్టాంపు డ్యూటీ 1శాతం కడితే చాలు, ఉత్తర్వులు జారీ

7 months ago 8
AP Stamp Duty Reduced On Agreements: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేందుకు స్టాంప్ డ్యూటీని తగ్గించింది. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, సేల్ కం జీపీఏ కింద చెల్లించే స్టాంపు డ్యూటీని 4% నుంచి 1%కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా స్థిరాస్తి రంగంలో ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నరెడ్కో, క్రెడాయ్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిర్మాణదారులకు, కొనుగోలుదారులకు వెసులుబాటు కలుగుతుంది.
Read Entire Article