Andhra Pradesh Govt LRS BPS 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను తీసుకురానుంది. అనుమతులు లేని భవనాలు, లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకాలు గడువు ముగియడంతో నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ అవకాశం రావడంతో నగర, పట్టణ ప్రజలు తమ నిర్మాణాలను చట్టబద్ధం చేసుకోవచ్చు. దీని ద్వారా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలకు ఊరట లభించనుంది.