Compassionate Appointments In APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015 (డిసెంబర్ 31కు)కు ముందు చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తారు. ఈ మేరకు ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదారు నెలలుగా కసరత్తు జరుగుతున్నా అడుగులు ముందుకుపడలేదు.. ఎట్టకేలకు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే వీరిని ఉద్యోగల్లో నియమించనున్నారు ఆర్టీసీ అధికారులు.