Supreme Court Relief To Multipurpose Health Assistants: ఆంధ్రప్రదేశ్‌లో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల ఉద్యోగాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2002లో నియమితులై, తర్వాత కోర్టు ఉత్తర్వులతో ఉద్యోగాలు కోల్పోయిన 1,200 మందికి 2013లో ప్రభుత్వం మానవతా దృక్పథంతో మళ్లీ ఉద్యోగాలు కల్పించింది. ఈ నియామకాలను సుప్రీంకోర్టు తాజాగా ఖరారు చేయడంతో వారికి ఊరట లభించింది. ఈ తీర్పుతో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.