Chandrababu On Loans With Moratorium: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారికి రూ. 50 వేలు, ఫస్ట్ ఫ్లోర్, ఆ పైన ఉన్న వారికి 25 వేలు లోన్లు ఇవ్వాలని బ్యాంకులకు సూచించామన్నారు. షాపులు, వాణిజ్య సంస్థలు, ఎంఎస్‌ఎంఈల రుణాలను రీషెడ్యూల్ చేసి.. రెండేళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని కూడా బ్యాంకర్లను అడుగుతున్నామన్నారు. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని.. స్వల్పకాలిక పంటరుణాలను రీషెడ్యూల్ చేసి 12 నెలల మారటోరియం ఇవ్వాలని కోరామని.. టర్మ్‌లోన్స్ వాయిదాలను రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలివ్వాలని అడిగామన్నారు.