Andhra Pradesh Matsyakara Bharosa Scheme: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభవ పథకంపై సీఎం క్లారిటీ ఇచ్చారు. మిగిలిన పథకాల అమలుపై తేల్చి చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి యోజన రూ. 6000, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 14 వేలు కలిపి మొత్తం రూ. 20వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు. మత్స్యకార భరోసా, నిరుద్యోగ భృతి పథకాలపైనా క్లారిటీ ఇచ్చారు.