ఏపీలో వారందరికీ బిగ్ రిలీఫ్.. త్వరలోనే పింఛన్లు.. మంత్రి కీలక ప్రకటన..

3 months ago 12
రాష్ట్రంలోని హెచ్ఐవీ బాధితులకు ఊరట కలిగించేలా ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ఎయిడ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. 2030 నాటికి ఏపీని ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని అన్నారు. హెచ్ఐవీ బాధితులకు అండగా ఉంటామన్న మంత్రి.. ప్రస్తుతం రాష్ట్రంలో 42 వేల మంది హెచ్ఐవీ బాధితులకు పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కొత్త పింఛన్ల కోసం 95 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని.. వాటిని పరిశీలించి అర్హులైన వారికి త్వరలోనే పింఛన్లు అందిస్తామని ప్రకటించారు.
Read Entire Article