మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగరీథ్.. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తరలింపు!

2 months ago 14
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థి బండి భగీరథ్‌ను మేడ్చల్ పోలీసులు గురువారం అర్థరాత్రి తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. తన విద్యా సంవత్సరం నష్టపోకుండా పరీక్షలు రాసుకునేందుకు జిల్లా కోర్టు ఈ నెల 20న అతనికి తాత్కాలిక ఊరటనిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన గడువు గురువారంతో ముగియడంతో పోలీసులు భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకుని.. కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలుకు తరలించారు.
Read Entire Article