ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో దెబ్బతిన్న ఆటోలకు పరిహారం పెంచాలని నిర్ణయించింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏపీలో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ ప్రాంత వాసులను బుడమేరు భయపెట్టింది. ఈ వరదల్లో పదుల సంఖ్యలో చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం అప్పట్లో ప్రభుత్వం పరిహారం ప్యాకేజీ ప్రకటించింది. ఆ మేరకు వరద సాయం పంపిణీ చేసింది. ఈ క్రమంలోనే దెబ్బతిన్న ఆటోలకు రూ.10000 చొప్పున పరిహారం అందించగా.. ఆ మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.