ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లక అదనంగా రూ.4000 ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం సచివాలయం వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త అంబులెన్సుల కొనుగోలుతో పాటుగా 108 సిబ్బంది, డ్రైవర్లకు 4000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 108,104 సేవలను ఒకే సర్వీస్ ప్రొవైడర్ కిందకు తేవాలని నిర్ణయించారు. వీటితో పాటుగా పలు కీలక ప్రతిపాదనలకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.