ఏపీలో వారందరికీ శుభవార్త.. బ్యాంక్ రుణాలు చెల్లించనున్న ప్రభుత్వం!

1 year ago 13
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరిట తీసుకున్న బ్యాంకు లోన్లను చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లాలోన టిడ్కో ఇళ్లను ఛైర్మన్ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే టిడ్కో ఇళ్ల కోసం స్థలాలు ఇచ్చిన రైతులకు కూడా విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. జూన్ లోగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు.
Read Entire Article