ఏపీలో నీరు చెట్టు బిల్లులకు మోక్షం లభించింది. ఏళ్ల తర్వాత పెండింగ్ బకాయిలు చెల్లించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థికశాఖను ఆదేశించారు. 2014-19 మధ్యన నీరు చెట్టు పథకం పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం తొలివిడతగా రూ.259 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. నీరు చెట్టు పథకం కింద చెరువుల్లో పూడికతీతతో పాటుగా చెరువుల అభివృద్ధి పనులను అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టారు. అయితే అప్పటి పనులకు సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్‌లో నిలిచిపోగా.. వైసీపీ ప్రభుత్వం చెల్లింపులు చేయలేదు. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు నిర్ణయించారు.