Andhra Pradesh NFBS Scheme Rs 20000 Cheating: ఆంధ్రప్రదేశ్‌లో వితంతువులను ఓ ముఠా మోసం చేస్తోంది. అసలు లేని పథకం పేరు చెప్పి రూ.2 వేలు తీసుకుని రూ.20 వేలు ఇప్పిస్తామని ఆశ చూపిస్తున్నారు. జిరాక్స్ షాపుల నిర్వాహకులు, కొందరు ఉద్యోగులు కూడా ఈ మోసంలో భాగస్వాములు అవుతున్నారు. పల్నాడు జిల్లాలో కొందరు తహసీల్దార్లు ఈ పథకం లేదని ప్రకటనలు కూడా విడుదల చేయాల్సి వచ్చింది. ఈ కేటుగాళ్లు వితంతువుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు.