మత్స్యకారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వేట నిషేధంలో ఉన్న మత్స్యకారులకు త్వరలోనే రూ.20 వేలు అందిస్తామని మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ జగన్ మీద ఓ రేంజులో విరుచుకుపడ్డారు. అన్ని హామీలను అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టంచేశారు.