AP BLOs Supervisors Enhancement Of Remuneration: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో), సూపర్‌వైజర్లకు శుభవార్త అందించింది. వారి వార్షిక పారితోషికాన్ని గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బీఎల్‌వోలకు రూ.12 వేలు, సూపర్‌వైజర్లకు రూ.18 వేలు వార్షిక గౌరవ వేతనం లభిస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీరి సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.