Chandrababu On Rs 1 Lakh To Haj Pilgrims: ఏపీలో మైనార్టీ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలను అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ.లక్ష సాయం, ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం కింద నెలకు రూ.10వేలు, రూ.5వేలు హామీలను అమలు చేయాలన్నారు. అలాగే మసీదుల నిర్వహణకు రూ.5 వేలు ఇచ్చే కార్యక్రమానికి కూడా త్వరలో శ్రీకారం చుట్టాలన్నారు. షాదీ ఖానాలు, ఇతర నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వేను రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.