ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఇబ్బందులు తొలగించేలా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. మంత్రి నారా లోకేష్ చేసిన విజ్ఞప్తి మేరకు ముందస్తుగా కొన్ని నిధులు విడుదల చేయాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా కొన్ని నిధులు విడుదల చేసి కాలేజీ యాజమాన్యాలకు భరోసా కల్పించాలని ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అందులో భాగంగానే త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయనున్నారు.