ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు ఇచ్చే సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఆయా జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వటంతో సంక్రాంతి సెలవులను కుదించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.