Andhra Pradesh Seaweed Details: సముద్రపు నాచుని తేలిగ్గా తీసుకోవద్దు.. ఇది చాలా విలువైనది. జపాన్, చైనాలో దీనిని ఆహారంగా తీసుకుంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లోనూ దీనికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ నాచును శాస్త్రవేత్తలు దీనిని పోషకాల నిధి అంటున్నారు. మందులు, ఎరువులు, పశువుల దాణాగా ఉపయోగిస్తున్నారు. బిస్కెట్లు, పాస్తా, నూడుల్స్ కూడా తయారు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దీని సాగు మొదలైంది. ఈ నాచుతో ఎన్నో లాభాలున్నాయి, తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!