Andhra Pradesh School Students Kits: ఏపీ ప్రభుత్వం విద్యాశాఖలో ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ మేరకు స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల స్కూల్ యూనిఫామ్.. వచ్చే విద్యా ఏడాది నుంచి మారనుంది. ఈ మేరకు యూనిఫామ్ రంగును వచ్చే విద్యా సంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే బ్యాగ్, ఇతర వస్తువుల నాణ్యతను పెంచాలని నిర్ణయించారు. ఈసారి ముందగానే టెండర్లను పిలిచి.. వచ్చే ఏడాది జూన్ రెండోవారం నాటికి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.