ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. జూన్ 12న ఉచితంగా ఇస్తారు.. రెడీగా ఉండండి

10 months ago 13
Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kits: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు బ్యాగుల బరువు తగ్గించేందుకు సిద్ధమైంది. కొత్త విద్యా సంవత్సరంలో పుస్తకాల సంఖ్యను తగ్గించి, కొన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. ఒకటి, రెండు తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం కలిపి ఒక పుస్తకంగా, 3-5 తరగతులకు నాలుగు పుస్తకాలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, షూస్ కలిగిన కిట్‌లను అందివ్వనున్నారు. జూన్ 12న వీటిని పంపిణీ చేయనున్నారు.
Read Entire Article