Andhra Pradesh School Students Holistic Progress Report Cards: ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం హోలిస్టిక్ కార్డుల్ని తీసుకొచ్చింది. సరికొత్తగా క్యూ ఆర్ కోడ్‌తో ఈ కార్డుల్ని ముద్రించారు.. విద్యార్థి సమగ్ర వివరాలతో పాటుగా కీలకమైన సమాచారాన్ని కూడా పొందుపరుస్తారు. విద్యార్థికి సంబంధించిన బ్లడ్ గ్రూప్, బరువు, ఎత్తు, బీఎంఐ వంటి సమాచారాన్ని కూడా సేకరిస్తారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు కూడా రేటింగ్స్ ఇవ్వనున్నారు.