Andhra Pradesh Parent Teacher Meeting In December: ఏపీలో స్కూల్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్! ఈ ఏడాది కూడా మెగా పీటీఎం డిసెంబర్ 5న జరగనుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నత విద్యపై కీలక సమీక్ష నిర్వహించి, యూనివర్సిటీలకు యూనిఫైడ్ యాక్ట్, పరిశ్రమలతో అనుసంధానం, 100% క్యాంపస్ ప్లేస్‌మెంట్లు వంటి అనేక సంస్కరణలకు ఆదేశాలు జారీ చేశారు. అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం కోసం టీచర్లను సింగపూర్‌కు పంపనున్నారు.