AP Parents Teachers Meeting On December 7th: దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాలు ఒకే రోజున పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా 44,303 ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే ఈ సమావేశాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు కలిపి 1.2 కోట్ల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈ మేరకు షెడ్యూల్‌ను వివరించారు. ఆహ్వానాలు కూడా వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులతోనే డిజైన్లు చేయించి తల్లిదండ్రులను ఆహ్వానించినట్లు తెలిపారు. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో జరిగే పీటీఎంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొంటారన్నారు.