ఏపీలో రాజ్యసభ ఉపఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య.. తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించనున్నారు.