ఏపీలోని ఆ కాంట్రాక్టు సిబ్బందికి షాక్.. 50 ఏళ్ల వరకే సర్వీస్..!

4 months ago 20
ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఓ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ టెండర్ పత్రాలలో 50 ఏళ్ల లోపు వారిని నియమించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో 50 ఏళ్లకు పైబడిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపల్ శాఖలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లని.. తమకు మాత్రం 50 ఏళ్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Read Entire Article