అనంతపురం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి 300 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ రూ.300 కోట్లు కేటాయించారు.