ఏపీ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాల్లో వేయి మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భూకేటాయింపులపై కలెక్టర్‌ను నివేదిక కోరినట్లు మంత్రి వెల్లడించారు.