కర్నూలు జిల్లాకు మరో గుడ్ న్యూస్ అందింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బెవరేజెస్ ప్లాంట్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద రిలయన్స్ కంజ్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బెవరేజెస్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వర్చువల్‍గా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బెవరేజెస్ ప్లాంట్‌ను కర్నూలుకు తీసుకువచ్చామన్నారు. ఈ ప్లాంట్ ద్వారా 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.