Nellore Airport Land Acquisition: నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 418 ఎకరాల భూసేకరణకు అనుమతితో పాటు, పరిహారం కూడా ఖరారు చేసింది. ఈ మేరకు మొదటి దశ పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విమానాశ్రయం పూర్తయితే, జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపు వస్తుంది. ప్రయాణికుల, సరుకు రవాణా పెరిగి, చుట్టుపక్కల జిల్లాలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.