Tirupati Secunderabad Vande Bharat Additional Coaches: తిరుపతి, సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా నాలుగు ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇకపై ఈ రైళ్లు మొత్తం 20 కోచ్‌లతో అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల సీట్ల లభ్యత పెరిగి, మరింత సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేవారికి, తిరుమల శ్రీవారి భక్తులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.