ఆంధ్రప్రదేశ్‌లోని ఉల్లి రైతులకు చంద్రబాబు సర్కార్ భారీ ఊరట కల్పించింది. రైతుల దగ్గర ఉన్న ఉల్లి పంటను వెంటనే కొనుగోలు చేసి నిల్వ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రైతులకు ఇబ్బంది కలగకుండా.. ఉల్లి పంటను ఆరబెట్టి.. నిల్వ చేయాలని పేర్కొంది. రైతుల నుంచి క్వింటాల్ ఉల్లికి రూ.1200 చెల్లించి.. కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేసింది. రైతులు, వినియోగదారులు ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని.. ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.