Bhimavaram Town railway station Get 32 Crore: ఏపీలోని రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఎంపిక కావటంతో 73 రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రైల్వేస్టేషన్లు ఈ పథకం కింద ఎంపికయ్యాయి. భీమవరం టౌన్, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఏలూరు రైల్వేస్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఎంపిక కాగా.. 32 కోట్లతో భీమవరం టౌన్ రైల్వేస్టేషన్‌లో పనులు చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.