Dharmavaram Railway Station Gets 7.50 crore under Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని పలు రైల్వేస్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం.. వీటి ద్వారా రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఈ క్రమంలోనే సత్యసాయి జిల్లా ధర్మవరం రైల్వేస్టేషన్‌ను కూడా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఏడున్నర కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అందులో భాగంగా తొలి విడతగా రూ.3.50 కోట్లు విడుదలతో పనులు చేపడుతున్నారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్ నిర్మాణం జరుగుతోంది.