Ap Weather Today: నాలుగు రోజుల పాటూ ఏపీకి వణికించిన వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు ఉంటాయంటున్నారు. భారీ వర్షాలు లేకపోయినా.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వానలు కొనసాగాయి. ఇటు విజయవాడలో సహాయక కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.