ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అన్న క్యాంటీన్లను మండలాలకు కూడా విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పట్టణాలు, జిల్లా కేంద్రాలలో మాత్రమే అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. అయితే పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మండలాలలోనూ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తోంది. ప్రతి మండలంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు సమాచారం.