AP Government Subsidy loans for BC: వెనుకబడిన వర్గాలు, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రేషన్ కార్డు, ఇతరత్రా పత్రాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధింత ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలి. 50 శాతం రాయితీతో బీసీలకు రుణాలు అందించనున్నారు.