మహిళల రక్షణ, భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ తేనున్నట్లు సమాచారం. సురక్ష పేరుతో మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురక్ష యాప్ రూపకల్పనపై పలు సూచనలు చేశారు. మహిళా దినోత్సవం నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.