ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మిర్చి రైతులను ఆదుకోవాలన్న ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు స్పందించిన కేంద్రం.. క్వింటా మిర్చికి రూ.11,781 మద్దతు ధరగా నిర్ణయించింది. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం కింద క్వింటా మిర్చి మద్దతు ధరను రూ. 11,781లుగా నిర్ణయించింది. అలాగే 2.58లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని సేకరించేందుకు అవకాశం ఇచ్చింది. నెలరోజుల పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.