మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే కౌలు రైతులలో చాలా మందికి సీసీఆర్ కార్డు లేని పరిస్థితి . ఈ నేపథ్యంలో సీసీఆర్ కార్డుతో పనిలేకుండా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.