ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. 35 శాతం సబ్సిడీ

1 month ago 3
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35 శాతం రాయితీతో గోడౌన్లను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. సచివాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గోడౌన్ల అద్దెలో రైతులకు 35 శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్, రబీ సీజన్ ముందు ఏ జిల్లాలో ఏ పంటలు సాగుచేస్తారు.. విత్తనాలు, ఎరువులు ఎంత మేరకు అవసరమవుతాయనే దానిపై ప్రభుత్వానికి నివేదికలు అందించాలని స్పష్టం చేశారు.
Read Entire Article