ఏపీ రైలు ప్రయాణికులకు ఒక శుభవార్త. చర్లపల్లి నుంచి వెళ్లే మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు.. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేట స్టేషన్‌లో ఒక స్టాప్ కల్పించారు. చర్లపల్లి నుంచి చెన్నైకి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇక నుంచి నాయుడుపేట స్టేషన్‌లోనూ ఆపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం.. నాయుడుపేట సబర్బన్ పట్టణంగా ఎదుగుతున్న క్రమంలో.. రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో నాయుడుపేట పరిసర ప్రాంత వాసులకు ప్రయోజనం కలగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.