ఏపీలో రోడ్లు, మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్రం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.223 కోట్లు కేటాయించింది. ఇందులో గుంటూరు జిల్లాకు 143 కోట్లు దక్కాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నిధులతో 138 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.