ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా, గ్రామీణ రహదారులపై సాఫీగా ప్రయాణం సాగనుంది. ప్రస్తుతం గుంతలమయమైన రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా.. ఇక ఆ ఇక్కట్లు తప్పననున్నాయి. ఈ మేరకు తాజా రాష్ట్ర బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశారు. రోడ్ల రిపేర్లకు మొత్తం రూ.3,237 కోట్ల నిధులు కేటాయించారు.