తెలంగాణ రాష్ట్ర పండగ అయిన బతుకమ్మ సంబరాలు.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఇక చివరిరోజు సద్దుల బతుకమ్మ కోసం తెలంగాణ సమాజం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే ఈ పండగను ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుపుకుంటున్నారు. మహిళలంతా కలిసి.. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చి.. ఆటపాటలతో సంతోషంగా నిర్వహించుకుంటున్నారు. ఇక అది చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు కూడా భారీగా తరలివస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది. ఆ సంగతులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.