ఆంధ్రప్రదేశ్‌ను వరుణుడు వీడటం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ముఖ్యంగా బుధవారం అనకాపల్లి, విజయనగరం,విశాఖపట్నం జిల్లాలలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.