ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ సోమవారం జీవో జారీ అయ్యింది. అయితే జిల్లా పేరు మార్పుపై మార్చి నెలలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మంత్రివర్గ సమావేశం నిర్ణయం మేరకు తాజాగా పేరు మార్పుపై ప్రభుత్వం నుంచి గెజిట్ విడుదలైంది. కడప జిల్లా పేరును వైసీపీ హయాంలో వైఎస్ఆర్ జిల్లాగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చింది.